


ఈ క్షేత్రము కె.గంగవరం గ్రామానికి అతి సమీపానగలదు. కాకినాడ నుండి పామర్రు, కోరుమిల్లి వెళ్ళు బస్సులు ఈ క్షేత్రము మీదుగా పోవును. కె. గంగవరం నుండి ప్రైవేటు వాహన సదుపాయం కలదు. అందువలన ఈ క్షేత్రము చేరుట సులభము. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదానికి చెందినది. ఈ జాతకులు సత్యవాడ యందు కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయనిర్మాణ శైలి మరియు ధ్వజ స్తంభము ఈ ఆలయం యొక్క పురాతనత్వమును గూర్చి తెలుపును.  ముఖ మంటపము 1948 ప్రాంతంలో నిర్మించబడినట్లుగా తెలియుచున్నది. ముఖమంటపముపై దేవతామూర్తుల విగ్రహములు నిర్మించబడ్డవి. ఈ గ్రామమును రెండవ భద్రాచలంగా పిలుస్తారు. దానికి కారణం ఈ గ్రామంలో సుమారు ఆరు రామాలయములు గలవు. శివాలయ ప్రాంగణంలోని అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైయున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి.
ముఖ మంటపము 1948 ప్రాంతంలో నిర్మించబడినట్లుగా తెలియుచున్నది. ముఖమంటపముపై దేవతామూర్తుల విగ్రహములు నిర్మించబడ్డవి. ఈ గ్రామమును రెండవ భద్రాచలంగా పిలుస్తారు. దానికి కారణం ఈ గ్రామంలో సుమారు ఆరు రామాలయములు గలవు. శివాలయ ప్రాంగణంలోని అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైయున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు గణపతి నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి.