

 
ఇంద్రపద భాగమును కోరువారు ఇంద్రేశ్వర స్వామి దేవాలయంలో ఓంకార పూర్వకమగు పంచాక్షరీ మంత్రమును నియమపూర్వకంగా జపించినచో ఆ మహాఫలమును పొందుదురు. ఇంద్రేశ్వరుని సమీప భూమియందు చేసిన స్నానము, దానము, హోమము, నియమము, అనుష్టానము, మంత్రోపదేశము తదితర పుణ్య కార్యక్రమములలో ప్రతి ఒక్కటియు కోటిరెట్లు పుణ్యము నిచ్చును.
 మానవుడు జీవితంలో ఒక్కమారైనను సప్తగోదావరిలో స్నానము చేసి యోగీశ్వర శివలింగమును దర్శించిన అణిమాది అష్టసిద్ధులు పొందును. సప్తగోదావరి జలముతో యోగీశ్వరస్వామికి అభిషేకము చేసి పువ్వులు, గంథము, అక్షతలతో పూజించిన మానవుడు కలికాలములో కలుగు పాపమును కాల్చివేసి త్వరగా స్వర్గలోకమును పొందును.
మానవుడు జీవితంలో ఒక్కమారైనను సప్తగోదావరిలో స్నానము చేసి యోగీశ్వర శివలింగమును దర్శించిన అణిమాది అష్టసిద్ధులు పొందును. సప్తగోదావరి జలముతో యోగీశ్వరస్వామికి అభిషేకము చేసి పువ్వులు, గంథము, అక్షతలతో పూజించిన మానవుడు కలికాలములో కలుగు పాపమును కాల్చివేసి త్వరగా స్వర్గలోకమును పొందును.  
సిద్దేశ్వర లింగ సమీపమునందు సాధకులకు జపము, హోమము, దానము, యాగము, ఉపవాసము మున్నగు వ్రతములు ఒక్కొక్కటి కోటి సంఖ్యతో సమానమగును.
 
శ్రీ కాళేశ్వరస్వామి సన్నిధిలో ఏకాంతము, ధ్యానము, మంత్రజపము, హోమము, దానము, శ్రార్థము అను వానిలో ప్రతి యొక్కటియు కోటిరెట్లు సంపూర్ణ సత్ఫలితములనిచ్చును.
 
కపాలేశ్వరస్వామిని యధావిధిగా పూజించినచో పాపములు నశించును. ఈ కపాలమోచనమను పుణ్యతీర్థ తటమందు దానము, హోమము, యజ్ఞము తదితర నియమములు యధావిధిగా తీవ్రనిష్టతో చేసినచో ఒక్కొక్కటి కోటిరెట్లు ఫలమునిచ్చును.
 
రామేశ్వర తీర్థము శివుని నివాసము అచట కోరిన కోరికలు తరగని ధాన్యమువలె మిక్కిలిగా ఫలించును. శ్రద్ధాభక్తులు కలుగును. రుద్రపాదము, శ్రీరామేశ్వరస్వామివారల సమీప ప్రదేశములో పితృయజ్ఞము (శ్రార్థము) చేసిన మానవులకు అపారఫలము కలుగును.
 
ఈతీర్థములో యధావిధిగా స్నానము చేసి శ్రీ సోమశ్వరుని సేవించిన ఈ జన్మలోగాని, గతజన్మలోగాని చేసిన పాపములు పూర్తిగా నశించి, మరణానంతరము పరమేశ్వరుని చేరును. సోమేశ్వరుని సేవించుట చేత త్యాగము, భోగము, దానము, సత్యము, సమృద్ధి, కీర్తి, సౌందర్యము, సంపద, జ్ఞానము అనునవి మిక్కిలిగా వృద్ధి పొందును.
 
శ్రీ వీరభద్రేశ్వర లింగమును సేవించువారు చిరకాలము శివుని కొలువులో గాణాపత్యము అను మహావైభవమును పొందుదురు. ఈ స్వామి సన్నిధిలో చేసిన హోమము, దానము, వేదాధ్యయనము, జపము మొదలగు కార్యములు అనేక సత్ఫలితములు ఇచ్చును.
 
యజ్ఞతటాకములో స్నానము చేసి యమేశ్వరస్వామి సన్నిధిలో శ్రార్థము చేసినచో నరకకూపమునందు ఉన్న పితృదేవతలు అందరూ ఉద్ధరింప బడుదురు. యమేశ్వరుని సన్నిధిలో మృత్యుంజయ మహామంత్రమును 1008మార్లు జపము చేయవలెను.
 
బ్రహ్మేశ్వరుని సేవించునట్టి పుణ్యాత్ములగు నాలుగు వర్ణముల వారికి సత్యలోక, విష్ణులోక, శివలోకములలోని పదవులు లభించును. బ్రహ్మేశ్వరస్వామి సన్నిధిలో వేదపాఠము, శాస్త్రపాఠము, తపస్సు, దానము, ధ్యానము, సమాధి, పూజ, మంత్రజపము చేయువారికి అసాధ్య కార్యములు ఉండవు.