అనాదినుండి అంతర్వాహినియగు సప్తగోదావరీ తీరమున వెలసిన క్షేత్రము దక్షారమము. ఈ క్షేత్రము పలువిధముల ప్రశస్తి పొందియున్నది. ఆంధ్రదేశామునకు త్రిలింగ దేశమున పేరుగల్గుటకు కారణమైన మూడు దివ్య క్షేత్రములలో ఒకటైన దక్షారామముగను, అష్టాదశ శక్తిపీఠములలో మాణిక్యాంబ కోలువైయున్న పన్నెండవ శక్తిపీఠముగను లోకమాన్యత కలిగియున్నది. అట్లే ఈ శివక్షేత్రము దక్షిణకాశీగా పేరుపొందినది. భీమనాధుని మించిన దైవము, దక్షవాటికను మించిన ధామము, సప్తగోదావారిని మించిన తీర్థరాహము జగతిలో లేవని పురాణోక్తి. ఇచట వెలసిన భీమేశ్వరుడు స్వయంభువుగా చెపుతారు. దక్షయజ్ఞము జరిగిన సమయంలో పిలువకుండగనే తండ్రి యాగము చూడవలెనన్న వాంఛతో వచ్చిన సతీదేవిని దక్షుడు దుర్భాషలతో అవమానిస్తాడు. ఆ అవమానము భారిమ్పలేక సతీదేవి అగ్నిని సృష్టించుకొని అందు దేహత్యాగము చేసింది. సతీదేవి ఆత్మాహుతి జరిగిన ప్రదేశములో పరమశివుడు భీమరూపములో వెలసినట్లు చెబుతారు. ఈ స్వయంభూలింగమును మొట్టమొదటగా సూర్యభగవానుడు అర్చించినాడని ప్రతీతి. మరిన్ని వివరాలు”