+91 7731881113
info@epoojastore.com

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి – కుందూరు

ధనిష్ఠ నక్షత్రం – 4వ పాదంKunduru

ఈ క్షేత్రము ద్రాక్షారామ – కోటిపల్లి రహదారిలో గంగవరం బస్టాపునకు ముందు రెండు కిలోమీటర్ల దూరంలో దంగేరు మార్గమున సుమారు రెండు కిలోమీటర్ల దూరమున కలదు. దంగేరు వైపు వెళ్ళు బస్సులు గ్రామము గుండా వెళ్ళును. లేదా గంగవరం నుండి గాని ద్రాక్షారామ నుండి గాని ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. ఇచట కొలువైయున్న శివస్వరూపం నక్షత్ర శివాలయాలలోని ధనిష్ఠ నక్షత్రం నాలుగవ పాదమునకు సంబంధించినది. ఈ జాతకులు కుందూరు యందు కొలువైయున్న శివలింగ సందర్శనము మరియు అర్చనాదులచే వారి గ్రహపీడలు తొలగి సంతోషము, శాంతి పొందెదరని ప్రగాఢ విశ్వాసాన్ని భక్తులు ప్రకటిస్తారు.

ఆలయ ముఖమంటపం మరియు ధ్వజస్తంభం 1960వ సంవత్సరంలో నిర్మించబడ్డాయి. సుమారు వంద సంవత్సరముల క్రితం నిర్మాణం జరిగింది. ఈ ఆలయం పది సంవత్సరాల క్రితం పునరుద్ధరణ చేయబడినట్లు తెలియుచున్నది. క్షేత్ర పరంగా అనేక సంవత్సరాల చరిత్ర కలదు. ఈ ఆలయమున చండీశ్వరుడు, అంతరాలయంలో గణపతి కొలువైయున్నారు. గ్రామమునందు లక్ష్మీనారాయణస్వామి ఆలయం, రామాలయం, షిరిడిసాయిబాబా వారి ఆలయం కలవు. స్వామివారి కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు నిర్వహించబడతాయి.