+91 7731881113
info@epoojastore.com

శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్త్యేశ్వ్రస్వామి – చెల్లూరు

చిత్త నక్షత్రం – 3వ పాదం

ఈ క్షేత్రము సందర్శించుటకు మండపేట ఆలయము నుండి చెల్లూరుకు రోడ్డు మార్గము కలదు. మండపేట చేరుటకు ఉభయ గోదావరిజిల్లాల నుండి విస్తృతమైన రవాణా సౌకర్యము కలదు. ఈ క్షేత్రము చిత్త నక్షత్రం మూడవ పాదానికి చెందినది. ఈ జాతకులకు ఈ క్షేత్ర స్థిత అగస్త్యేశ్వరస్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం.

పంచ అగస్త్యేశ్వర క్షేత్రములలో ఆఖరిది చెల్లూరు. ఈ ఆలయము ఇటీవలి కాలమందు కడురమణీయముగా పునర్నిర్మించబడినది. విచిత్ర మేమనగా అగస్త్య ప్రతిష్టిత శివలింగము ఆలయ బయట ప్రాంగణములో నుండి లోపల అన్యప్రతిష్టిత లింగము కలదు, అగస్త్యేశ్వరుని లింగము పైన కేవలం ఛాయ కొరకు ఫైబర్ షీట్ తో పందిరి మాదిరిగా వేసియున్నారు. పూర్వము అది కూడా ఉండెడిదికాదట. కారణము తెలియరాలేదు.

ఈ ఆలయమందు శ్రీ స్వామివారు గాక అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి, గణపతి కోలువైయున్నారు. నవగ్రహ మంటపము గలదు. ఈ క్షేత్రమున క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాలస్వామివారు. ఈ గ్రామము అగస్త్యేశ్వర క్షేత్రము కన్నా ఎక్కువగా కపిలేశ్వరపురం జమీందారుగారి సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ ద్వారా ప్రసిద్ధము.