ఈ క్షేత్రము యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారి యందలి ఎర్రపోతవరం వద్ద అండ్రంగి జంక్షన్ కు సుమారు రెండు, మూడు కిలోమీటర్ల దూరమున కలదు. అండ్రంగి జంక్షన్ నుండి కేవలం ప్రయివేటు వాహనం ద్వారా గాని స్వంత వాహనం ద్వారా గాని ఈ ఆలయానికి చేరుకోగలము. మేష, వృషభ రాశులకు (18 పాదశివాలయాలకు) ఈ క్షేత్ర స్థిత గంగాధరమూర్తి ఆధిపత్యం వుంటుంది. ఆయా రాశులయందు ఆయా నక్షత్ర పాదములయందు జన్మించినవారు వారి నక్షత్ర పాదములకు సంబంధించిన శివాలయ దర్శనము చేసిన పిమ్మట విధిగా ఈ ఆలయ దర్శనము కూడా చేయవలెను. తద్వారా శుభఫలములు చేకూరును.
ఈ క్షేత్రమునకు సంబంధించి విశేష కథనం కలదు. ఈ ఆలయ స్థిత గంగాధర స్వామివారి నామము ద్వారా ఈ కుగ్రామమునకు విలాసగంగవరమను నామము కలిగినట్లు కథనం. అనేక సంవత్సరముల క్రితం నుండి విలసిల్లిన ఈ శివలింగము ఒక వృక్షము క్రింద యే ఆచ్చాదన లేకుండా ఉండెడిదట. నేడు శివశ్రీగా పేరుపొందిన వీరశైవ మతావిలంబియైన తాళ్ళ సాంబశివరావుగారు బాల్యంలో అనుదినము స్నానానంతరము ఒక చెంబుడునీళ్ళను లింగముపై పోసెడివారట. ఆ క్షేత్రము యొక్క ప్రాధాన్యత తెలియకున్నను ఈ రీతిన నిత్యకృత్యముగా స్వామిని అభిషేకించుట వలన ఆ బాలునికి శివునిపై ప్రీతి అధికమై ఉత్తరోత్తరా ఆయనలో పరమశివునిపట్ల అచంచల భక్తితత్పరత కలిగి ప్రస్తుతం ప్రచారంలో వున్న “రాశిలింగము, నక్షత్ర శివాలయముల” పరిశోధన మరియు ప్రాధాన్యతలను వాటి ప్రామాణికత అతి ప్రాచీనమైన “భీమసభ” శిలాశాసన రూపమునకు అన్వయించి విషయంలో బీజము పడినట్లు తెలియుచున్నది.
సుమారు 28 సంవత్సరముల క్రితం శివశ్రీ గంపల సోమేశ్వరరావుగారు, దవులూరి వెంకటరమణ మరియు వారి కుటుంబసభ్యుల సహకారంతో ఆలయనిర్మాణము మరియు పూజ్యం నాగేశ్వరరావుగారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా లింగప్రతిష్ట జరిగినవి. ఈ ఆలయంలో 27 అంగుళముల పానపట్టము ఉండుట విశేషము. అలాగే అమ్మవారి విగ్రహము క్రింద శివశ్రీ తాళ్ళ సాంబశివరావుగారి ఇంట పూజలందుకొన్న శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరగడం విశేషము. ఈ ఆలయ సమీపములో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షము మరియు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కదంబ వృక్షము వున్నవి. అతి త్వరలో ఆలయ శిఖర ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయు సంకల్పము కలదు. ఈ ఆలయమునందు ప్రతివారు స్వయంగా స్వామిని అర్చించుకునే అవకాశం కలదు.

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై వున్నది.అంతేకాక ఆలయం కూడా రహదారి ప్రక్కనే వుండటం విశేషం.ఈ క్షేత్రము భీమసభ యందలి ప్రథమ వృత్తంలో వుండడం విశేషం. అంతేకాక ఈ క్షేత్రస్థిత శివమూర్తి కూడా శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి కావడం మరో విశేషం. మిధునరాశియందు జన్మించిన వ్యక్తులు వారి నక్షత్ర శివాలయంతో పాటు ఈ రాశి లింగమును మరియు భీమసభ అధిపతి అయిన ద్రాక్రారామ క్షేత్రస్థిత భీమేశ్వరమూర్తిని దర్శించుకొని వారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించడం కద్దు.
ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో వున్నది. నిర్మించబడుచున్న ఆలయము మిక్కిలి విశాలముగను బృహదాలయముగాను రూపుదిద్దుకొనుచున్నవి. తాత్కాలికముగా రహదారికి రెండవవైపు ఒక బాలాలయంలో స్వామివారి మరియు అమ్మవారి మూర్తులను ఇతర దేవతా మూర్తులను వుంచడం జరిగింది. ఇచటి పుష్కరిణి అందలి స్నానఘట్టమును చూసిన యెడల ఆలయ పురాతనత్వమునకు సంబంధించి ఒక అంచనాకు రావచ్చును. ఈ స్నానఘట్టపు మెట్లు ద్రాక్షారామంలోని ఆలయమునకు వినియోగించిన శిలలను పోలియుండుట మనం గమనించవచ్చు.
పూర్వపు ఆలయము సుమారు ఐదు, ఆరు శతాబ్దాల క్రితమే నిర్మితమైనట్లు ఆధారములు కనబడుచున్నవి. ప్రస్తుత ఆలయ నిర్మాణము గ్రామస్థుల సహకారము మరియు దేవాదాయశాఖవారి సంయుక్త కృషివల్ల సంపన్నమగుచున్నది. ఉపాలయములుగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల ఆలయము కలవు. ఈ గ్రామంలో ఈ ఆలయము కాక మరియొక శివాలయము కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఇచట వైభవోపేతంగా నిర్వహంచబడతాయి.
ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు మూడుకిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు. రామచంద్రాపురం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా కూడా చేరవచ్చును.సుప్రసిద్ధ చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన ఈ బృహదలయం కర్కాటకం మరియు సింహరాశులలో జన్మించిన (18 నక్షత్ర పాదశివాలయాలు) జాతకులకు సంబంధించిన రాశిలింగం కావడం విశేషం. అతి పురాతనమైన ఈ ఆలయం సుమారు అరవై సంవత్సరముల క్రితం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అత్యంత విశేషమైన ఈ ప్రాంగణం శివ విష్ణు స్వరూపాలు వరుస మందిరాలలో కొలువైవుండడం అద్భుతం. వరుసగా గణపతి, వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరులు, సోమేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరి అమ్మవారు, అంక సీతారామస్వామి, శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కొలువై వున్నారు.ఇవి కాక చండీశ్వరాలయం, నవగ్రహ మంటపం కూడా కలవు. ఈ గ్రామంనందు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి, వృద్ధ సోమేశ్వరాలయం, వినాయక ఆలయములు కలవు. కర్కాటక, సింహరాశి యందు జన్మించిన వారు వారి వారి నక్షత్ర పాద శివాలయాలతో పాటు ఈ క్షేత్రంలో కోలువైయున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత సోమేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన ఎడల విశేష ఫలితములు పొందవచ్చునని భక్తుల విశ్వాసము.
స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి సోమేశ్వరస్వామి వారికి, వేణుగోపాలస్వామివారికి, వెంకటేశ్వరస్వామిగారికి ఏకకాలంలో పాంచాహ్నికంగా నిర్వహించబడతాయి. ఇది క్షేత్ర విశేషం. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా జరుగుతాయి. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి.

ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రైవేటు వాహనం ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్ర స్థిత శివలింగము అతి పురాతనమైనది. ఒక పుట్ట నుండి బైటపడినట్లు కథనం. ప్రస్తుతం ఉన్న ఆలయం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమైనట్లు తెలుస్తోంది. నేటికిని ఈ గర్భాలయంలో పుట్ట ఉండడం విశేషం. అంతేకాక ఆ పుట్టనుండి అప్పుడప్పుడు నాగుపాము వెలువడి లింగమునకు చుట్టుకుని వుండడం భక్తులను అబ్బుర పరుస్తుంది. అంతరాలయంలో అమ్మవారు, మంటపంలో గణపతి కొలువై ఉన్నారు.
ఈ ఆలయంలో నవగ్రహ మంటపము, చండీశ్వరాలయము కలవు. ఈ ఆలయమునందు 108 బిందెల నీళ్ళతో స్వామివారికి అభిషేకము చేసిన ఎడల దీర్ఘకాలంగా అవివాహితులైన యువతీయువకులకు వివాహము జరుగునని మరియు సంతానము లేనివారికి సంతాన యోగము కలుగునని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ విధముగా ఐదు సోమవారములు అభిషేకము చేయవలెను. (బిందెలు దేవస్థానమువారు సమకూర్చెదరు) కన్యారాశికి సంబంధించిన నక్షత్ర పాదములలో (9 నక్షత్ర పాదములలో)జన్మించిన వారికి వారి వారి నక్షత్ర పాదములతో పాటు రాశి లింగమైన ఈ క్షేత్ర దర్శనము మరియు అర్చనాభిషేకములు విశేష ఫలాలను ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్యేశ్వరషష్ఠి ఉత్సవము ఘనంగా నిర్వహించబడుతుంది.
ఈ క్షేత్రము ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం ఉత్తర ద్వార గోపురమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు. భీమేశ్వరాలయం నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము సుప్రసిద్ధ యోగిపుంగవులు ఆదివారపుపేట బాలయోగిగా ప్రాముఖ్యత వహించిన శివబాలయోగివారి ఆశ్రమము. సద్గురు శివబాల యోగివారు యోగిపుంగవులు మాత్రమే కాక తపస్సంపన్నులు కూడా. వీరే ప్రస్తుత నక్షత్ర శివాలయముల పరిశోధనకు ఆద్యులు. ప్రస్తుతం శివసాయుధ్యం పొందిన బాలయోగిస్వామివారి యొక్క శిష్యులు శివశ్రీ గంపల సోమేశ్వరరావుగారు మరియు శివశ్రీ తాళ్ళ సాంబశివరావుగారు అకుంఠిత శ్రమ మరియు దీక్ష ఫలమే ఈ నక్షత్ర శివాలయాలకు ఆది. ఈ ఆశ్రమంలో స్వామి, అమ్మవార్ల మూర్తులతో పాటు గణపతి ఇత్యాది దేవతామూర్తులు కూడా కలరు.
ప్రస్తుతం శ్రీలంక దేశమునకు చెందిన మాతాజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో నిత్యం స్వదేశీ మరియు విదేశీ భక్తుల మరియు యాత్రికుల సౌకర్యార్థం ఈ ప్రాంగణంలో వసతి సౌకర్యం ఏర్పరచబడినది. ఇక్కడ ప్రస్తుతం బాలయోగి స్వామివారి సమాధి, మంటపంతో పాటు విశాలమైన ధ్యానమందిరం కూడా నిర్మాణంలో వున్నది. తుల, వృశ్చిక రాశులకు చెందిన (18 నక్షత్ర పాద శివాలయములకు) జాతకులు వారి సంబంధిత పాద శివాలయంతో పాటు ఈ క్షేత్ర సందర్శనము కూడా విశేష ఫలప్రదమని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రములో కార్తీక మాసోత్సవములతో పాటు మహాశివరాత్రి కూడా ఘనంగా నిర్వహించబడతాయి. అంతేకాక వసంతనవరాత్రులు, శరన్నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతాయి. మాతాజీవారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాదికములు పారాయణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఈ క్షేత్రము ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం ఉత్తర ద్వార గోపురమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు. భీమేశ్వరాలయం నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము సుప్రసిద్ధ యోగిపుంగవులు ఆదివారపుపేట బాలయోగిగా ప్రాముఖ్యత వహించిన శివబాలయోగివారి ఆశ్రమము. సద్గురు శివబాల యోగివారు యోగిపుంగవులు మాత్రమే కాక తపస్సంపన్నులు కూడా. వీరే ప్రస్తుత నక్షత్ర శివాలయముల పరిశోధనకు ఆద్యులు. ప్రస్తుతం శివసాయుధ్యం పొందిన బాలయోగిస్వామివారి యొక్క శిష్యులు శివశ్రీ గంపల సోమేశ్వరరావుగారు మరియు శివశ్రీ తాళ్ళ సాంబశివరావుగారు అకుంఠిత శ్రమ మరియు దీక్ష ఫలమే ఈ నక్షత్ర శివాలయాలకు ఆది. ఈ ఆశ్రమంలో స్వామి, అమ్మవార్ల మూర్తులతో పాటు గణపతి ఇత్యాది దేవతామూర్తులు కూడా కలరు.
ప్రస్తుతం శ్రీలంక దేశమునకు చెందిన మాతాజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో నిత్యం స్వదేశీ మరియు విదేశీ భక్తుల మరియు యాత్రికుల సౌకర్యార్థం ఈ ప్రాంగణంలో వసతి సౌకర్యం ఏర్పరచబడినది. ఇక్కడ ప్రస్తుతం బాలయోగి స్వామివారి సమాధి, మంటపంతో పాటు విశాలమైన ధ్యానమందిరం కూడా నిర్మాణంలో వున్నది. తుల, వృశ్చిక రాశులకు చెందిన (18 నక్షత్ర పాద శివాలయములకు) జాతకులు వారి సంబంధిత పాద శివాలయంతో పాటు ఈ క్షేత్ర సందర్శనము కూడా విశేష ఫలప్రదామని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రములో కార్తీక మాసోత్సవములతో పాటు మహాశివరాత్రి కూడా ఘనంగా నిర్వహించబడతాయి. అంతేకాక వసంతనవరాత్రులు, శరన్నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతాయి. మాతాజీవారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాదికములు పారాయణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఈ క్షేత్రము ద్రాక్షారామ క్షేత్రమునకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రైవేట్ వాహనముల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రమందలి ప్రస్తుత ఆలయం శ్రీయుతులు వల్లూరి రామేశ్వరరావుగారిచే సుమారు ఇరవై ఏళ్ళక్రితం నిర్మించబడ్డది. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, చండీశ్వరుడు మరియు నవగ్రహ మంటపం కలవు. ఆలయానికి ఎదురుగా పుష్కరిణి, స్నానఘట్టం వుండటం విశేషం. చక్కని ప్రకృతి సౌందర్యంతో పచ్చని చేల మధ్యనున్న ఈ ఆలయం భక్తులను ముగ్దులను చేస్తుందనడంలో సందేహం లేదు.
ధనుస్సురాశికి చెందిన ఈ క్షేత్రమును ఈ రాశికి చెందిన మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన జాతకులు వారి సంబంధిత నక్షత్ర పాదశివాలయ సందర్శన, అర్చనలతో పాటు ఈ రాశిలింగాన్ని కూడా సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఎడల ఉత్తమ ఫలితములు పొందగలరు.
ఈ క్షేత్రము ద్రాక్షారామ – కోటిపల్లి ప్రధాన రహదారిపై వెంకటాయపాలెం గ్రామానికి సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు. ద్రాక్షారామం నుండి ప్రైవేటు వాహన సౌకర్యం కలదు. ఈ ఆలయము సుమారు 15 సంవత్సరముల క్రితం నిర్మించబడినది. ముఖమంటప నిర్మాణం సుమారు సంవత్సరం క్రితం జరిగినది. దేవాలయ స్థలము మరియు అర్చామూర్తులు శ్రీమతి చల్లా మహాలక్ష్మీ మరియు వారి కుటుంబసభ్యులచే కీ.శే. చల్లా వెంకటరామానుజరావుగారి జ్ఞాపకార్థం సమర్పించబడ్డాయి.
ఈ క్షేత్రము మకర, కుంభ రాశులకు చెందిన శివాలయముగావున ఆ రెండు రాశుల యందలి నక్షత్ర పాదములయందు (18 నక్షత్రపాదములయందు) జన్మించిన వారికి యోగ కారకములు కావున ఆ జాతకులు ఈ ఆలయస్థిత శివలింగమునకు అర్చనాభిషేకములు నిర్వర్తించిన శుభ ఫలితములు కలుగును. ఈ ఆలయమునందు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చండీశ్వరుడు ఉపాలయములలో గలరు.

ఈ క్షేత్రము యానాం – ద్రాక్షారామ రహదారిపై ద్రాక్షారామకు మూడు కిలోమీటర్లకు ముందుగా ఉండును. ఆలయము రహదారికి సుమారు కిలోమీటరు దూరంలో ఎల్లారమ్మగుడి సమీపమున కలదు.ఈ క్షేత్రమునకు దక్షాద్వర నలత్రయ తీర్థంగా పేరు గలదు. సతీదేవి తండ్రి ద్వారా అవమానింపబడిన సతీదేవి ఇదే ప్రాంతంలో యోగాగ్నిలో దగ్ధమైనట్లు కథనం. ఇక ఆలయం విషయానికి వస్తే ఒక నేరేడు వృక్షంలో ఈ శివలింగం ఉండేదట. చెట్టును కొట్టు సమయంలోఈ శివలింగం బయటపడినది. అమ్మవారి యొక్క విగ్రహం సమీపమున గల ఒక పనస చెట్టు వద్ద లభ్యమైనట్టు చెబుతారు. సుమారు ఇరవై ఏళ్ళక్రితం ప్రస్తుత ఆలయం నిర్మించబడ్డది.
మీనరాశికి చెందిన పూర్వాభాద్ర నాలుగవ పాదం, ఉత్తరాభాద్ర మరియు రేవతి నక్షత్ర పాదములయందు జన్మించిన (9 పాదములు) వారు వారి వారి పాద శివాలయములతో పాటు ఈ ఆలయస్థిత శివమూర్తిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఎడల శుభఫలితములను పొందగలరని భక్తుల విశ్వాసము. ఆలయ ఉపాలయాలలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు మరియు దాక్షాయణి అమ్మవారు కొలువై యున్నారు. ఈ గ్రామంలో పాతాళ భీమేశ్వరాలయము మరియు షిరిడీసాయి ఆలయము కలవు. ఈ ఆలయానికి ప్రత్యేకించి అర్చకులు లేరు. శ్రీ కలిదిండి పట్టాభిగారి వంశీకుల ఆధ్వర్యంలో పూజాదికములు నిర్వహించబడతాయి.