info@bheemasabha.com

శ్రీ సర్వమంగళ అన్నపూర్ణా సమేత చెన్నమల్లెశ్వరస్వామి – గురజానాపల్లి

మృగశిర నక్షత్రం – ద్వితీయ చరణంGurajanapalli

ఈ క్షేత్రము కాకినాడ – యానాం ప్రధాన రహదారిలోని చొల్లంగి జంక్షన్ నుండి గాని లేదా కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని నడకుదురు గ్రామం వద్ద గురజనాపల్లి జంక్షన్ నుండి గాని చేరవచ్చును. ఈ గ్రామం చేరుటకు బస్సు సౌకర్యం అనుకూలంగా వుండదు కావున పై రెండు జంక్షన్లలో బస్సు దిగి ఆటో ద్వారా ఆలయము చేరవచ్చును. నక్షత్ర శివాలయాలలో ఈ క్షేత్రము వృషభరాశి యందలి మృగశిర నక్షత్రం రెండవ పాదమునకు చెందినది.

ఈ జాతకులు ఈ క్షేత్రమున వెలసిన శివమూర్తిని శ్రద్ధగా అర్చించిన యెడల శుభ ఫలములు చేకూరగలవని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్రము వృద్ధగౌతమి నదీతీరాన కలదు. అంతేకాక ప్రసిద్ధ సప్తగోదావరి యాత్ర జరుగు చొల్లంగి గ్రామము ఈ క్షేత్రమునకు అత్యంత సమీపమున గలదు. పురాతన ఆలయము జీర్ణమైనందున 1997పునఃనిర్మాణం మరియు అర్చామూర్తుల శాస్త్రోక్త పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయము కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. మరియు శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరుగును.