info@bheemasabha.com

శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ సోమేశ్వరస్వామి – యండగండి

మూల నక్షత్రం – ప్రథమ చరణంendagandi

ఈ క్షేత్రము కె.గంగవరం నుండి కోరుమిల్లి మార్గమున కలదు. కాకినాడ, రాజమండ్రి నగరాల నుండి బస్సు సౌకర్యం మరియు కె.గంగవరం నుండి ప్రైవేటు వాహన సౌకర్యం కలదు. చేరుట సులభము. ఈ క్షేత్రము మూల నక్షత్రం మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు యండగండి ఆలయమున ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అభిషేకార్చనలు నిర్వర్తించిన యెడల వారి గ్రహదోషాలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.

ప్రస్తుత ఆలయం దేవాదాయశాఖ మరియు గ్రామస్థుల సహకారంతో 2014లో పునర్నిర్మించబడ్డది. అంతక్రితం ఈ ఆలయం నాలుగు శతాబ్దాల పైబడి విలసిల్లినట్లు తెలుస్తున్నది. ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మరియు చండీశ్వరుడు కొలువైయున్నారు. అంతరాలయంలో గణపతి దర్శనమిస్తాడు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా వైభవోపేతంగా నిర్వహించబడతాయి.