info@bheemasabha.com

శ్రీ మహిషాసురమర్ధిని సమేత రాజరాజనరేంద్రస్వామి – వెలవలపల్లి

ధనిష్ఠ నక్షత్రం – ప్రథమ చరణంVelavalapalli

ఈక్షేత్రము అయినవిల్లికి సమీపంలో కలదు. రాజమండ్రి నుండి మురమళ్ళ వెళ్ళు బస్సు ఈ క్షేత్రము గుండా వెళ్ళును. ముక్తేశ్వరం నుండి కొత్తపేట నుండి ప్రైవేటు వాహన సౌకర్యం ఉండును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదానికి చెందినది. ఈ జాతకులు స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వర్తించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయం రాజరాజనరేంద్రుని కలలో కనిపించి ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేయమని ఆదేశించినట్లు చెబుతారు. ఆలయ పునరుద్ధరణ మరియు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ 1954వ సంవత్సరంలో జరిగినట్లు ఇక్కడి శిలాఫలకముల ద్వారా తెలియుచున్నది. చక్కని నిర్మాణశైలిలో రూపొందిన ఈ ఆలయ స్వాగతతోరణంపై శివకుటుంబం ముఖద్వారంపై నటరాజస్వామి ప్రాకారం వెలుపల, లోపల కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలతో సహా అనేక దేవతా చిత్రాలు భక్తులకు కన్నులపండుగ చేస్తాయి.

గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వీరభద్రుడు అంతరాలయంలో కొలువైయున్నారు. నవగ్రహ మంటపం కలదు. స్వామివారి కల్యాణోత్సవం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి.