info@bheemasabha.com

శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వరస్వామి – శానపల్లిలంక

పూర్వాభాద్ర నక్షత్రం – ద్వితీయ చరణంSanapillanka1

ఈ క్షేత్రమున ముక్తేశ్వరం గ్రామానికి సమీపాన గలదు. బస్సు సౌకర్యం ప్రస్తుతం లేదు. ప్రైవేటు వాహన సౌకర్యం విరివిగా కలదు.పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము. సుమారు 150 సంవత్సరముల చరిత గల ఈ ఆలయం 2010 వ సంవత్సరంలో పునర్నిర్మాణం పునఃప్రతిష్ఠ జరుపబడినది.

ఈ క్షేత్రమును ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి పాదభాగముగా చెబుతారు. అంతేకాక త్రేతాయ్గంలో శ్రీరామచంద్రమూర్తి పరివార సమేతంగా విచ్చేసినప్పుడు వారి సేనలు ఈ ప్రాంతంలో విడిది చేశారని, ఆ కారణం చేత ఈ ప్రాంతానికి సేనపల్లి అనే నామం కలిగి ఉత్తరోత్తరా వ్యవహారికంలో శానపల్లి లంకగా రూపాంతరం చెందినట్లు కథనం. ఈ ఆలయంలో అమ్మవారు ఉపాలయంలో కొలువైవుంటారు. అంతరాలయంలో మహాగణపతి మరియు ఆలయం వెలుపల చండీశ్వరులు కోలువైవున్నారు. ఆలయానికి చేర్చ శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము కలదు. ఈ ఆలయం 2014లో పునర్నిర్మించబడ్డది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి కల్యాణం జరుగుతున్నది. శరన్నవరాత్రులు ఇక్కడ విశేషంగా జరుగుతాయి.