info@bheemasabha.com

శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి – మాచవరం

హస్త నక్షత్రం – చతుర్థ చరణంMachavaram

ఈ క్షేత్రము రామచంద్రాపురం మండపేట ప్రధాన రహదారిపై కలదు. రహదారి నుండి కాలువ దాటి అవతలి వడ్డుకు వెంతెన ద్వారా చేరిన ఎడల మాచవరం గ్రామమునకు చేరవచ్చును. ప్రధాన రహదారి నుండి ఆలయం సుమారు కిలోమీటరు దూరము ఉండును.
హస్త నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినవారు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల ఆ జాతకులు విశేష ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయం రెడ్డిరాజుల కాలంలో (18వ శతాబ్దంలో) నిర్మించబడినట్లుగా తెలియుచున్నది. తదుపరి 1990వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ మరియు పునఃప్రతిష్ఠ జరిగినది. అంతరాలయంలో గణపతి ఆలయం బయట చండీశ్వరులు కొలువై వున్నారు. గ్రామంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరబ్రహ్మేంద్రస్వామి, కనకదుర్గాదేవి మరియు సాయినాథుని ఆలయాలు కలవు. శివాలయ ప్రాకారముపై వివిధ దేవతామూర్తుల చిత్రములు భక్తులకు కన్నుల పండుగ చేస్తాయి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు నిర్వహించబడతాయి.