info@bheemasabha.com

శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి – కాపవరం

పుష్యమి నక్షత్రం – ప్రథమ చరణం

ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ – రామాచంద్రాపురం (వయా వెల్ల) మార్గంలో వెల్ల గ్రామానికి ముందు కలదు. ప్రధాన రహదారికి సుమారు కిలోమీటరు దూరంలో ఈ ఆలయం వున్నది. కాపవరం బస్సు స్టాపు వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం మరియు ప్రైవేటు వాహన సౌకర్యం కూడా కలదు. ఈ ఆలయము పుష్యమి నక్షత్రం మొదటి పాదమునకు చెందినది కావడం వలన ఈ ఆలయ స్థిత స్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వహించిన యెడల ఈ నక్షత్రంవారు వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితములు పొందగారని భక్తుల విశ్వాసము.

అతి పురాతనమైన ఈ ఆలయం అనేక సంవత్సరాలుగా ఏ రకమైన జీర్ణోద్ధరణకు గాని పునర్నిర్మాణానికి గాని నోచుకోలేదు. 1953 ప్రాంతంలో ఆలయానికి ముందువున్న కాలక్షేప మంటప నిర్మాణం జరిగింది. అంతరాలయంలో గణపతి, బయట చండీశ్వరుడు కొలువై వున్నారు . ఈ ఆలయానికి చేర్చి 1949వ సంవత్సరంలో రామాలయం నిర్మించబడ్డది. చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి కళ్యాణోత్సవము జరుగుతుంది. శరన్నవరాత్రులు వైభవోపేతంగా నిర్వహించబడతాయి.