info@bheemasabha.com

శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు – కాపులపాలెం

రేవతి నక్షత్రం – ద్వితీయ చరణం

ఈ క్షేతము యానాం పట్టణానికి అత్యంత సమీపంలో కలదు. యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిని ఆనుకుని ఈ ఆలయం ఉండును. చేరుట అత్యంత సులభము. ఈ క్షేత్రము రేవతి నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ దర్శనము, అభిషేకార్చనలు చేసిన యెడల విశేష ఫలాలను పొందగలరని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ చరిత్రను చూసిన యెడల 16వ శతాబ్ధినాటిదిగా తెలుయుచున్నది ఇటీవల 2011లో అత్యద్భుతంగా పునర్నిర్మాణం గావించడం జరిగింది.

ఆలయ ముఖద్వారంపై, గోపురంపై దేవతామూర్తుల విగ్రహములు సుందరంగా చిత్రీకరించబడ్డవి. విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలలో గణపతి, అమ్మవారు, చండీశ్వరులు కొలువైయున్నారు. నవగ్రహ మంటపము, యాగమంటపం కూడా నిర్మించబడ్డవి, ఈ గ్రామమునందు సీతారామస్వామివారి ఆలయం కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున నిర్వహించబడుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వైభవోపేతంగా జరుగుతాయి.