info@bheemasabha.com

శ్రీ బాలా త్రిపురసుందరి సమేత ఇష్టకాంతేశ్వరస్వామి – పెనికేరు

అనూరాధ నక్షత్రం – ప్రథమ చరణంPenikeru

ఈ క్షేత్రము ఆలమూరు సమీపంలోని కొత్తూరు సెంటరుకు సమీపమున కలదు. కాకినాడ – రావులపాలెం ప్రధాన రహదారిపై కొత్తూరు సెంటరు వద్ద బస్సు దిగి ప్రైవేటు వాహనం (ఆటో) ద్వారా ఈ క్షేత్రాన్ని చేరవచ్చును. ఈ ఆలయ స్థిత లింగమూర్తికి ఇష్టకాంతేశ్వరస్వామి అని నామము కలుగుటకు ఆశక్తికర కారణం చెప్పబడుతోంది. ఎవరయితే అవివాహిత యువకుడు తనకిష్టమైన స్త్రీని భార్యగా పొందదలచిన యెడల ఈ ఆలయ స్థిత శివస్వామిని శ్రద్ధతో అర్చించిన యెడల ఫలితం లభించగలదు. ఇష్టకాంతను పొందు అనుగ్రహము కలిగించు ఈ స్వామికి ఇష్టకాంతేశ్వర నామము సార్థకమైనది.

పురాతన క్షేత్రమైన ఈ ఆలయము కీ.శ. 4-3-1993న పునర్నిర్మితమైనది. ఆలయ ప్రాకారంపై దేవతామూర్తుల చిత్రములు అందముగా చిత్రించబడ్డవి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్ర బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా వైభవోపేతంగా జరుగుతాయి. గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయము కూడా కలదు.