ఈ క్షేత్రము దుళ్ళ సమీపంలో కలదు. రోడ్డు రవాణాశాఖవారి బస్సు సౌకర్యం కలదు. మండపేట నుండి రాజమండ్రి – రావులపాలెం ప్రధాన రహదారిపై వున్న చొప్పెల్ల గ్రామం నుండి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చును. విశాఖ నక్షత్రం మూడవ పాదమునకు చెందినవారు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఈ జాతకులకు విశేష ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
మూడువందల సంవత్సరాల పైబడి ప్రాచుర్యంలో ఉన్న ఈ ఆలయము 1986వ సంవత్సరం ఏప్రిల్ నెలలో పునర్నిర్మించబడి పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయమందు అంతరాలయంలో గణపతి, చండీశ్వరులు కొలువైయున్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి. ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో అన్నాభిషేకములు నిర్వహించుట ఇక్కడి విశేషం.