info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – వెంటూరు

స్వాతి నక్షత్రం – చతుర్థ చరణంVentooru-1

ఈ క్షేత్రము మండపేట నుండి ద్రాక్షారామ నుండి పామర్రు నుండి కూడా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం కలదు. చంద్ర ప్రతిష్టిత ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రములలో ఒకటిగా ఉండి నక్షత్ర శివాలయాలలో స్వాతి నక్షత్రం నాలుగవ పాదమునకు చెందిన క్షేత్రం కావడాన ఈ ఆలయ దర్శన మరియు అర్చనాభిషేకాదుల చేత ఈ జాతకులు మాత్రమే కాక అన్యులకు కూడా శుభ ఫలితాలను చేకూర్చగలవని భక్తుల విశ్వాసము.

ఈ క్షేత్రములో విశేషమేమనగా ప్రస్తుత శివాలయము, శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి మరియు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో వుంటాయి. ఈ ఆలయంలో గణపతి, పార్వతీదేవి, చండీశ్వరుడు ఉపాలయాలు కలవు. నవగ్రహ మంటపం కూడా వున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ విశేషంగా నిర్వహించబడతాయి.