info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి – పెదపళ్ళ

అనూరాధ నక్షత్రం – చతుర్థ చరణంpedapalla

ఈ క్షేత్రము చేరుటకు రామచంద్రాపురం – రావులపాలెం ప్రధాన రహదారియందు ఆలమూరుకు ముందు చింతలూరువైపు మళ్ళవెలెను. చింతలూరుకు అతిసమీపంలో ఈ క్షేత్రము కలదు. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో అనూరాధ నక్షత్రము నాలుగవ పాదానికి చెందినది. ఈ జాతకులు ఇచ్చటి ఆలయ స్థిత శివస్వరూపానికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన విశేష ఫలితం లభించగలదని భక్తుల విశ్వాసం.

బహుపురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం పునర్నిర్మాణం 2008వ సంవత్సరంలో జరిగింది. ఈ ఆలయ ముఖమంటప నిర్మాణం, ధ్వజస్తంభ నిర్మాణం 1995వ సంవత్సరంలో జరిగింది.
స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవము వైశాఖ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా నిర్వహింపబడుతుంది. ఈ ఆలయానికి చేర్చి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం నిర్మాణంలో వున్నది. ఈ క్షేత్రంలో శివాలయానికి చేరువలో విష్ణాలయం కూడా వున్నది.