info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి – తాతపూడి

ఉత్తరాషాఢ నక్షత్రం – ప్రథమ చరణంtatapudi

ఈ క్షేత్రము అంగర క్షేత్రానికి సమీపానగలదు. కపిలేశ్వరపురం లేదా మండపేట ద్వారా ఈ క్షేత్ర సమీపమున గల ప్రధాన రహదారి వద్ద దిగి లోనికి వెళ్ళవలెను. లేదా ప్రైవేటు వాహనం ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందినది.

ఈ జాతకులు తాతపూడి యందు కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం సుమారు రెండు దశాబ్దాల పూర్వమే నిర్మాణమైనట్లు తెలుస్తున్నది. తదుపరి 1994వ సంవత్సరంలో మంటప నిర్మాణం జరిగినది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఈ క్షేత్రంలో ఘనంగా జరుగుతాయి.