info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత వీరేశ్వరస్వామి – వడ్లమూరు

జ్యేష్ఠ నక్షత్రం – ప్రథమ చరణంvadlamuru

ఈ క్షేత్రము చేరుటకు రామచంద్రాపురం – మండపేట ప్రధాన రహదారిలో పసలపూడి వద్ద చెల్లూరు వైపు వెళ్ళు మార్గము ద్వారా కాలేరు మార్గాన వెళ్ళవచ్చును. దీనికి ప్రత్యేక రవాణా సదుపాయం లేనందున సొంత వాహనంపై కాని ఆటో ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో జ్యేష్ఠ నక్షత్ర మందలి మొదటి పాదానికి చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్రాన కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత వీరేశ్వరస్వామివారిని దర్శించుకుని యథాశక్తి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల సుఖసంతోషాలను పొందగలరని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయం ముఖద్వారంపై శివకుటుంబం శిల్పీకరించబడి కనులపండుగ చేయును. ఆలయ చరిత్ర ప్రకారం సుమారు మూడు శతాబ్ధముల క్రితం నుండి వున్నట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1987వ సంవత్సరంలో దేవాదాయశాఖవారు ఆలయ ముఖమంటపము ప్రారంభించినట్లుగా అక్కడ శిలాఫలకం ద్వారా తెలుస్తున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రంలో శరన్నవరాత్రులు కూడా విశేషంగా జరుగుతాయి. ఈ ఆలయం కాక ఈ గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం కూడా కలదు.