info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి – కూర్మాపురం

విశాఖ నక్షత్రం – చతుర్థ చరణంKoormapuram

ఈ క్షేత్రము చేరుటకు కాకినాడ నుండి బస్సు సౌకర్యం కలదు. పామర్రు, ద్రాక్షారామ నుండి ప్రైవేటు వాహనం ద్వారా కూడా చేరవచ్చును. ప్రసిద్ధ అష్టసోమేశ్వర క్షేత్రమైన వెంటూరుకు సమీపాన ఈ క్షేత్రము కలదు. విశాఖ నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినవారు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఈ జాతకులకు విశేష ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుత ఆలయం సుమారు 18వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా తెలియుచున్నది.

ఉత్తరోత్తరా చిన్న చిన్న పునరుద్ధరణ పనులు తప్ప విశేషించి ఏ రకమైన మార్పులు జరుగలేదు. ఈ ఆలయం యొక్క అంతరాలయములో గణపతి, నాగబంధము, కుమారస్వామి దర్శనమిస్తారు. చండీశ్వరాలయం కలదు. ఈ ఆలయానికి సమీపంలో రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి, వేంకటేశ్వరస్వామి మరియు శ్రీరామచంద్రులు ఆలయములు కలవు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా స్వామివారి దివ్య కల్యాణం జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి నిర్వహిస్తారు.