info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి – మారేడుబాక

స్వాతి నక్షత్రం – ప్రథమ చరణంMaaredubaka

ఈ క్షేత్రము మండపేట పట్టణమునకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం లేనందున మండపేట నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము స్వాతి నక్షత్రం మొదటి పాదానికి చెందినది. ఈ జాతకులకు ఈ క్షేత్ర స్థిత మల్లెశ్వరస్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన కొలువైయున్న శివస్వరూపం అతి ప్రభావంతమని భక్తుల విశ్వాసము, దీనికి కారణం ఈ శివలింగ ప్రతిష్ఠ సప్తఋషుల ద్వారా జరిగినట్లు చెప్పబడుచున్నది.

సుమారు నూరు సంవత్సరముల పైబడి నిర్మించబడ్డ ఆలయము జీర్ణావస్థకు చేరుకోవడం వలన అర్చామూర్తులను, గణపతిని బాలాలయంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వహించబడతాయి. గ్రామంలో లక్ష్మీ సమేత జనార్థనస్వామి వారి ఆలయం కలదు.