info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి – నరసాపురపుపేట

మఖ నక్షత్రం – ప్రథమ చరణంnarasapurapupeta

ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై ఉండుట వలన విస్తృత రవాణా సదుపాయం కలదు. అందువలన ఈ క్షేత్రము చేరుట సులభము. ఈ క్షేత్రము మఖ నక్షత్రము మొదటి పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ఈ పరమేశ్వర లింగము స్వయంభూలింగముగా తెలియుచున్నది. ఆలయము సుమారు రెండువందల సంవత్సరముల నుండి విలసిల్లియున్నది.

ఈ క్షేత్రమునందలి ఉపాలయముగా వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కలదు. గ్రామంలో రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము కూడా వున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేకాక శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఇక్కడ విశేషంగా జరుగుతాయి.