info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వరస్వామి – తనుమళ్ళ

రోహిణి నక్షత్రం – ప్రథమ చరణంTanumalla

ఈ క్షేతము అష్టసోమేశ్వరాలయాలలో ఒకటైన పెనుమళ్ళ క్షేత్రమునకు కిలోమీటరు దూరములో కలదు. ఈ క్షేత్రమునకు బస్సు సౌకర్యము కలదు. ప్రయివేటు వాహనాల ద్వారా గాని స్వంత వాహనము ద్వారా గాని ఈ క్షేత్రమును చేరవచ్చును. ఈ క్షేత్రము రోహిణి నక్షత్రము మొదటి పాదమునకు చెందినది. ఈ ఆలయ స్థిత శ్రీపార్వతీ సమేత నీలకంఠేశ్వరస్వామి వారికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన రోహిణి నక్షత్రం మొదటి పాదమున జన్మించినవారి పీడలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము.

ఈ ఆలయమునందు సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు కూడా కొలువైయున్నారు. పురాతన క్షేత్రమైన ఈ ఆలయం యాభై సంవత్సరాల క్రితం పునరుద్ధరణ జరిగినట్లు తెలుస్తున్నది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున జరుగును. శరన్నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి కూడా నిర్వహించబడతాయి.