ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిపై రామచంద్రాపురం బైపాసు రోడ్డునకు సమీపమున గలదు, అందువలన విశేష రవాణా సౌకర్యం వున్నది. చేరుట అతిసులభము. ఈ క్ష్హేత్రము ఉత్తర నక్షత్రము రెండవ పాదమునకు చెందినది. కనుక ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ఈ ఆలయమునందలి స్వామి అగస్త్యమహర్షి ప్రతిష్ఠగా చెప్పబడుతోంది.
ప్రస్తుత ఆలయం సుమారు 150సంవత్సరములుగా విలసిల్లినట్టుగా తెలియుచున్నది. ఆలయమునందు అంతరాలయములో వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. గ్రామంలో ఈ ఆలయంకాక శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి ఆలయము మరియు షిరిడిసాయినాథుని ఆలయము కలవు. స్వామివారి కళ్యాణము వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున జరుగును. సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ విశేషము.