info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత సోమేశ్వరస్వామి – గండ్రేడు

ఆశ్లేష నక్షత్రం – తృతీయ చరణంgandredu

ఈ క్షేత్రము చేరుటకు రామచంద్రాపురం నుండి మరియు గొల్లలమామిడాడ నుండి మార్గము కలదు. అయితే రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం లేని కారణం చేత ప్రైవేటు వాహనం ద్వారా గాని, స్వంత వాహనం ద్వారా గాని చేరవలెను. ఈ క్షేత్రము ఆశ్లేష నక్షత్రము మూడవపాదమునకు చెందినది కావడం వలన ఈ జాతకులు గండ్రేడునందు కోలువైయున్న శ్రీఉమా సమేత సోమేశ్వరస్వామివారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన ఎడల విశేష శుభ ఫలితములు ఉండగలవని భక్తుల విశ్వాసము.

సుమారు సుమారు 150 సంవత్సరముల క్రితం నుండి విలసిల్లిన ఈ ఆలయము 2005-06 సంవత్సరంలో పునర్నిర్మించబడ్డది. ఈ గ్రామంలో శ్రీదేవీ, భూదేవి సమేత కేశవస్వామివారి ఆలయం కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అంతేగాక ఈ ఆలయమునందు శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా వైభవంగా నిర్వహించబడతాయి.