info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి – పాలమూరు

పుబ్బ నక్షత్రం – చతుర్థ చరణంpolamuru

ఈ క్షేత్రము అనపర్తి గ్రామమునకు అతి సమీపమున కలదు. అనపర్తి నుండి రాయవరం నుండి ఆటో ద్వారా ఈ క్షేత్రమును చేరవచ్చును. పుబ్బ నక్షత్రము నాలుగవ పాదమునకు చెందిన ఈ క్షేత్రమును సందర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన ఈ జాతకులకు వారి వారి గ్రహపీడలు తొలగి సుఖసంతోషాలను పొందగలరని భక్తుల విశ్వాసము. సుమారు 500సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో వున్నది.

మూల విరాట్టును ప్రక్కనే ఒక బాలాలయంలో ఉంచారు. ఈ ఆలయానికి చేర్చి ప్రక్కన ప్రాకారంలో దత్తాత్రేయులు, సాయినాథుడు, అయ్యప్ప, కళ్యాణ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ గణపతి, జ్ఞానసరస్వతి, సీతారామలక్ష్మణులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, చండీశ్వరులు కొలువైయున్నారు.

నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో కాలభైరవుడు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహ మంటపము మరియు హోమశాల నిర్మించబడుచున్నవి. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము కార్తీక బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి విశేషంగా జరుగుతాయి.