info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత రామలింగకోఠేశ్వరస్వామి – గుమ్మిలేరు

స్వాతి నక్షత్రం – తృతీయ చరణంGummileru

ఈ క్షేత్రము కాకినాడ – రావులపాలెం ప్రధాన రహదారిపై మండపేట దాటిన పిదప ఉన్నది. ఆలయం కూడా రహదారి ప్రక్కనే కలదు. ఈ క్షేత్రమును చేరుటకు విస్తృత రవాణా సౌకర్యం ఉండుట వలన చేరుట అతి సులభము. ఈ క్షేత్రము స్వాతి నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఈ ఆలయ స్థిత శివమూర్తిని దర్శించుకుని అర్చనాదులు నిర్వహించిన విశేష ఫలాలను పొందగలరని భక్తుల విశ్వాసము. ప్రతుత ఆలయము కీ.శ. 2002లో పునర్నిర్మితమైనది. అంతకు ముందు (1971 నుండి) ఉన్న పురాతన ఆలయము రహదారికి చేర్చిఉండెడిదట.

తదుపరి ఆలయం వెనుక గల చెరువును పూడ్చి ఈ ఆలయమును పునర్నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయములో గణపతి, నాగబంధము అంతరాలయములో ఉన్నవి. ఉపాలయంలో చండీశ్వరుడు గలడు. గ్రామమందు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి ఆలయం మరియు కోదండరామస్వామివారి ఆలయం కలవు. స్వామిరి దివ్య కళ్యాణోత్సవము ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుండి పంచాహ్నికంగా జరుగుతాయి. శరన్నవరాత్రులు సహితం వైభవోపేతంగా జరుగుతాయి.