info@bheemasabha.com

శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత వీరేశ్వరస్వామి – వాడపాలెం

శ్రవణం నక్షత్రం – తృతీయ చరణం.Vadapalem

ఈ క్షేత్రము కొత్తపేట గ్రామమునకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు. రావులపాలెం నుండి కొత్తపేట నుండి ప్రైవేటు వాహనముల ద్వారా ఈ గ్రామమును చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో శ్రవణం నక్షత్రం మూడవ పాదానికి చెందినది. ఈ జాతకులు స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం, విశాలమైన ఆలయ ప్రాంగణమునందు శివాలయంతో పాటు విఘ్నేశ్వరాలయం, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, మాణిక్యాంబా ఆలయం, శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం కలవు.

స్వయంభువుగా చెప్పబడుతున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం 1971వ సంవత్సరంలో నిర్మించబడినట్లు తెలుస్తోంది. Vadapalem-2ఈ ఆలయం బిక్కవోలు క్షేత్రం తర్వాత అంతటి ప్రాముఖ్యత చెందినది. శివాలయంతో పాటు మిగిలిన ఆలయములు కూడా 1971వ సంవత్సరంలో పునర్నిర్మించబడి అర్చామూర్తుల పునఃప్రతిష్ఠ జరిగింది. ఆలయ ప్రాకారముపైన గోపురములపైన దేవతామూర్తుల సుందర చిత్రములు, శిల్పములు ఏర్పాటు చేయబడినవి. స్వామివారి కల్యాణోత్సవం మాఘ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామివారి కళ్యాణము, మార్గశిర శుద్ధ షష్ఠి నుండి పాంచాహ్నికంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించబడుతాయి. వీటితో పాటు శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవములు జరుగుతాయి.