info@bheemasabha.com

శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి – అరికిరేవుల

మఖనక్షత్రం – తృతీయ చరణంArikirevula

ఈ క్షేత్రము మెళ్ళూరు గ్రామమునకు అతి సమీపమున కలదు. మెళ్ళూరు వెళ్ళిన భక్తులు అక్కడి నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణించిన ఈ క్షేత్రాన్ని చేరవచ్చును. ఈ క్షేత్రము మఖ నక్షత్రము మూడవ పాదానికి చెందినది. ఈ జాతకులు ఈ క్షేత్ర స్థిత శివస్వరూపానికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన శుభఫలితములు కలుగగలవని ప్రతీతి. ఈ క్షేత్రము అతి పురాతన ఆలయములలో ఒకటిగా ప్రస్తిద్ధి చెందినది. లభించిన సమాచారం ప్రకారం 1814వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

తదుపరి సుమారు 1998 ప్రాంతంలో గ్రామస్థుల సహకారంతో పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో గణపతి, కుమారస్వామి మరియు శివకోటి స్థూపము ఉపాలయములుగా కలవు. గ్రామంలో ఇవి కాక అభయాంజనేయస్వామి, భక్తాంజనేయస్వామి ఇత్యాది ఆలయములు కలవు. స్వామివారి కళ్యాణోత్సవము వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇవికాక శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యషష్ఠి ముందురోజు (పంచమి)శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కల్యాణోత్సవము మరుసటి దినం సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవము జరుగును.