info@bheemasabha.com

పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – పెనుమళ్ళ

ఆరుద్ర నక్షత్రం – -ప్రథమ చరణంPenumalla

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిలోని ఉండూరు వంతెన దాటిన వెంటనే ఎడమప్రక్క రహదారి వెంబడి గాని లేదా జగన్నాధగిరి గ్రామం నుండిగాని చేరవచ్చును. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యము కలదు. (కాకినాడ – అండ్రంగి సర్వీసు) ప్రయివేటు వాహన సదుపాయం కూడా లభ్యం అవుతుంది. ఈ క్షేత్రము చంద్రప్రతిష్టితమైన అష్టసోమేశ్వర క్షేత్రములలో ఈశాన్య దిక్కున ప్రతిష్టింపబడ్డ శైవక్షేత్రం మరియు నక్షత్ర శివాలయములలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదానికి చెందినది. అందువల్ల ఈ జాతకులకు ఈ క్షేత్రము అభిషేకార్చనలు విశేష ఫలితాన్నివ్వగలవని భక్తుల విశ్వాసము. క్షేత్ర ప్రసిద్ధి అనుసరించి ఇతర నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా క్షేత్ర దర్శన మరియు అర్చనాదులు శుభప్రదమని ఇచ్చటి అర్చకస్వామి వెల్లడించారు.

పైన తెలిపినట్లుగా ఈ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రమునకు ఈశాన్యం దిక్కున చంద్రునిచే ప్రతిష్టింపబడిన అతిప్రాచీన క్షేత్రం. ఈ ఆలయ జీర్ణోద్ధరణ సుమారు రెండువందల సంవత్సరముల క్రితం రామచంద్రాపురం రాజావారి అనుమతితో కీ.శే. శ్రీ నండూరి కంచిరాజుగారి ఆధ్వర్యంలో జరిగినట్లు తెలుస్తోంది ఈ క్షత్ర స్థిత దేవీ స్వరూపము పూర్వనామము రాజరాజేశ్వరీదేవిగా వుండి తదుపరి వ్యావహారికంలో ప్రస్తుత నామదేయమైన పార్వతీదేవిగా మార్పుచెందడం విశేషం.Penumalla2

శ్రీయుతులు ఉప్పలపాటి రామభద్రరాజుగారి సౌజన్యంతో 1962వ సంవత్సరంలో కళ్యాణమంటప నిర్మాణం జరిగింది. తదుపరి ఉప్పలపాటి ధర్మరాజు గారిచే వాహనశాల నిర్మితమైనది. రాజమండ్రి వాస్తవ్యులయిన శ్రీయుతులు దేశిరెడ్డి మురళీకృష్ణ గారిచే 2012వ సంవత్సరంలో నాగప్రతిష్ట జరిగినది. వీరి నిధులతోనే త్వరలో మహాముఖ మంటప నిర్మాణము చేయుటకు ఆలోచన కలదు. ఈ ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం పాంచాహ్నికంగా జరగడం విశేషం. ఈ సందర్భంగా ధ్వజారోహణం, రథోత్సవం కూడా జరుగుతాయి. ఈ గ్రామంలో విఘ్నేశ్వరాలయము, సాయిబాబా ఆలయము కూడా కలవు.