info@bheemasabha.com

పార్వతీ సమేత సోమేశ్వరస్వామి – వట్రపూడి

కృత్తిక నక్షత్రం – తృతీయచరణంVatrapudi

ఈ క్షేత్రము అద్దంపల్లికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రమును చేరవలెనన్న అద్దంపల్లెకు చేరడానికి ముందే మళ్ళవలెను. కృత్తిక నక్షత్రం మూడవపాదమున జన్మించిన వ్యక్తులు ఈ క్షేత్ర స్థిత పార్వతీ సమేత సోమేశ్వరస్వామిని దర్శించి అర్చించుకున్న యెడల వారి ఇబ్బందులు తొలగి సుఖసంతోషాలు పొందగలరని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రము కూడా అతి పురాతనమైనదయినను సుమారు ముప్పై సంవత్సరముల క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయమునందు ఏ విధమైన ఉపాలయములు లేవు. అలాగే గ్రామంలో కూడా ప్రతిష్ఠ ఆలయములు లేవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రి ఉత్సవములు కూడా విశేషముగా నిర్వహించబడును.